India vs England : Nasser Hussain Wants The England Skipper Joe root To Channelize Emotions
#JoeRoot
#Teamindia
#Indvseng
#ViratKohli
టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయిన అనంతరం ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ అభిమానులతో పాటు మాజీలు కూడా కెప్టెన్ జో రూట్, ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ముఖ్యంగా చివరి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్.. రూట్ కెప్టెన్సీని వేలెత్తిచూపాడు. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదని తీవ్రంగా మండిపడ్డాడు.